News25th Aug 04:21 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల

మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్ళకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్... ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్ళకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ. 25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంది. రాష్ట్రంలోని కోట్లాది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి దుర్గా దేవి మండపాలకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh
Nara Lokesh
Chandrababu Naidu
Ganesh Chaturthi
Free Electricity
Ganesh Pandals
Durga Devi Pandals
Government Decision
Gotti Pati Ravikumar
Festival Arrangements
మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
Scroll for the next article