Spiritual9th Sep 11:11 AMSunil Byrisetty1 min read
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ మండపాలకు మంత్రి నారా లోకేష్ ఉచిత విద్యుత్ ప్రకటించారు. గణేశ్ చతుర్ది వేడుకలకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అంది
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ మండపాలకు మంత్రి నారా లోకేష్ ఉచిత విద్యుత్ ప్రకటించారు. గణేశ్ చతుర్ది వేడుకలకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించింది. గణేశ్ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వ సహకారం అందిస్తోంది. ప్రజల పండగకు అండగా ప్రభుత్వం నిలిచింది.. మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. విఘ్వేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.