News8th Jun 11:40 AMSunil Byrisetty1 min read
మంగళగిరిలో ఉచిత ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు శ్రీకారం
మంగళగిరిలో దుర్వాసన లేని ఉచిత ఈ - టాయిలెట్ల ఏర్పాటుకు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. తన సొంత నిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ -టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నా
మంగళగిరిలో దుర్వాసన లేని ఉచిత ఈ - టాయిలెట్ల ఏర్పాటుకు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. తన సొంత నిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ -టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ముందు ప్రయోగాత్మకంగా మంగళగిరి నగరంలోని పాత బస్టాండ్ సెంటర్, తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి సమీపంలో రహదారిలో ఈ -టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. తరువాత కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ -టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. నగరానికి వివిధ పనుల నిమిత్తం వేలాదిమంది రాకపోకలు సాగిస్తున్నారు. మంగళగిరి చెనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలు సైతం ప్రతి రోజూ చేనేత వస్త్ర దుకాణాలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను గమనించిన మంత్రి నారా లోకేష్ కొత్త తరహా ప్రజా మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో తరహాలో ఈ -టాయిలెట్లను తన సొంత నిధులతో నియోజకవర్గంలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ -టాయిలెట్లతోపాటు చంటి బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్రీ ఫ్యాబ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ -టాయిలెట్లను ప్రొక్లెయిన్ సహాయంతో ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు.