News11th Nov 02:27 PMSunil Byrisetty1 min read

సచివాలయ ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది రెస్ట్ రూమ్‌లో నిర్వహించారు. ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డ

సచివాలయ ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది రెస్ట్ రూమ్‌లో నిర్వహించారు. ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డా.సియం.త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు మందడంలోని హాసిని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డా. రహీమ్ బాష ఈ ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయ ముఖ్య భద్రతాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ మంగళ, బుధవారం రెండు రోజులపాటు ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్పిఎఫ్ పోలీస్ సిబ్బంది అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు ఎం. వెంకటేశ్వర్లు, ఎస్. రమణ, ఎం.వి. శివకుమార్‌తో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Andhra Pradesh
Secretariat
SPF Police
Free Eye Check-up
Health Camp
Police Welfare
Dr. Rahim Bash
Eye Health
Government Initiative
ఏపీ సచివాలయం
ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం
కంటి పరీక్షలు
Scroll for the next article