News9th Aug 12:01 PMSunil Byrisetty1 min read

క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్ల పంపిణీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా

క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్ల పంపిణీ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా లేసు కళాకారులకు ఈ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్తకళాకారులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అవసరమైన 141 మంది కళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పవన్ కళ్యాణ్, మంగళగిరి క్యాంపు కార్యాలయంలో స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపించారు.
Ap government
Pawan Kalyan
Crochet Lace Artisans
Narsapuram
Handicrafts
Eye Care
Free Eyeglasses
Artisans Welfare
బొమ్మిడి నాయకర్
మహిళా కళాకారులు
వైద్య శిబిరం
ఆంధ్రప్రదేశ్
చేనేత హస్తకళలు
Scroll for the next article