News18th Jan 02:09 PMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పేదలకు అన్నదానం

మంగళగిరి 29 వ వార్డు టిప్పర్ల బజార్, గౌతమ్ బుద్ధ రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వర్ధంతిని పరిష్కరించుకొని పట్టణ టీడీ

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పేదలకు అన్నదానం
మంగళగిరి 29 వ వార్డు టిప్పర్ల బజార్, గౌతమ్ బుద్ధ రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వర్ధంతిని పరిష్కరించుకొని పట్టణ టీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ షమీరా ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం డీ ఇబ్రహీం హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డైరెక్టర్ ఇబ్రహీం మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారన్నారు. సినీ, రాజకీయ రంగాలలో తెలుగువారు గర్వించేలా చరిత్ర సృష్టించిన మహోన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. అలాంటి మహనీయుని వర్ధంతి రోజున పేద ప్రజలకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.
NTR Death Anniversary
Nandamuri Taraka Rama Rao
Telugu Desam Party
TDP Minority Cell
Annadanam Programme
Mangalagiri
పేదల సంక్షేమం
సామాజిక సేవ
ఎం.డి. ఇబ్రహీం
టీడీపీ నాయకులు
Scroll for the next article