News1st Apr 09:26 AMSunil Byrisetty1 min read
నేటి నుంచి మరో ఉచిత సిలిండర్
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత సిలిండర్ పథకం అమలవుతోంది. ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించా
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత సిలిండర్ పథకం అమలవుతోంది.
ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీపం 2 పథకం కింద గతేడాది నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు మొదటి సిలిండర్ అందించారు.
ఇక దీపం 2 లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని మంత్రి చెప్పారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
విశాఖలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని చెప్పారు.
త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఏటా 3 సిలిండర్లను దీపం 2 కింద లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా బడ్జెట్ కేటాయింపులూ చేశారు.