Health21st Mar 12:36 PMSunil Byrisetty1 min read

నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరిలో ఉచిత హోమియో

మంగళగిరి బైపాస్ రోడ్డు వీజే కాలేజ్ సమీపంలో ఇటీవల రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ను ప్రారంబోత్సవం చేసిన విషయం విదితమే. ఇదే షోరూమ్ వెనుక ఉ

నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరిలో ఉచిత హోమియో
మంగళగిరి బైపాస్ రోడ్డు వీజే కాలేజ్ సమీపంలో ఇటీవల రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ను ప్రారంబోత్సవం చేసిన విషయం విదితమే. ఇదే షోరూమ్ వెనుక ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని కూడా ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మాస్టర్ హోమియో వైద్యాలయం డా. మాధవీలత ప్రతి గురువారం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో వుండి ఉచిత వైద్యసేవలు అందించడంతో పాటు హోమియో మందులు కూడా ఉచితంగా అందిస్తారు. ఆ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హోమియో వైద్యశిబిరానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మంగళగిరి, పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వుండేలా ఉచిత హోమియో వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రజానీకం ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందించే ఉచిత హోమియో వైద్యసేవలను వినియోగించుకోవాలని కోరారు.
Homeopathy
Medical Camp
Nara lokesh
Dr. Madhavi Latha
మంగళగిరి
Scroll for the next article