Education15th Jul 04:41 PMSunil Byrisetty1 min read

ఎక్సలెన్సీ సెంటర్లలో ఐఐటీ, నీట్, జేఈఈ ఉచిత శిక్షణ

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (COEs)లో ప్రవేశాలకు ఆహ్వానిస్తోంది. ఇంటిగ్రేటెడ్ IIT/JE

ఎక్సలెన్సీ సెంటర్లలో ఐఐటీ, నీట్, జేఈఈ ఉచిత శిక్షణ
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (COEs)లో ప్రవేశాలకు ఆహ్వానిస్తోంది. ఇంటిగ్రేటెడ్ IIT/JEE & NEET కోచింగ్ తో కూడిన ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర (MPC/BiPC) కోర్సులలో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు APSWREIS కార్యదర్శి IAS వి. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (Co-education) కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 2026లో జూనియర్ ఇంటర్మీడియట్ (MPC/BiPC)లో 75% మార్కులు సాధించిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్ కోసం దరఖాస్తు చేసుకోవచన్నారు. ఈ 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (Co-education) కేంద్రాల ద్వారా ఇంటర్ విద్యతో పాటు IIT-JEE, NEET కోచింగ్, వసతి, భోజనం, స్టడీ మెటీరియల్, ఉచిత గురుకుల విద్యను అందిస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు 75% సీట్లు మరియు ఇతర వర్గాల (OC, ST, BC) విద్యార్థులకు 25% సీట్లు కేటాయించే రిజర్వేషన్ విధానం ప్రకారం ప్రవేశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. APBRAGCET వెబ్సైట్ https://apbrageet.apcfss.in లో 17 జూలై నుండి 30 జూలై వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
AP Education
Centres of Excellence
IIT JEE Coaching
NEET Coaching
Free Coaching
Intermediate Admissions
MPC
BiPC
SC Students
APBRAGCET
Scroll for the next article