TTD29th Jun 01:16 PMSunil Byrisetty1 min read

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్?

తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడంపై బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం సుమారు 70,000 నుంచి లక్ష మంది వరకు భక్తుల

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్?
తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడంపై బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం సుమారు 70,000 నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, ఘాట్‌రోడ్లు, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి వంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు ఇన్సూరెన్స్ కల్పించాలని యోచిస్తున్నారు. ప్రమాదాలు, జంతువుల దాడిలో మృతిచెందిన వారికి, ఆకస్మిక గుండెపోటుకి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతిచెందిన వారికి టీటీడీ 3 లక్షల రూపాయల వరకు అందిస్తోంది. ఇప్పుడు అలిపిరి - తిరుమల మధ్య ప్రయాణించే భక్తులకు బీమాను కల్పించాలని చూస్తున్నారు. పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
TTD
Tirumala
Free Insurance To TTD Pilgrims
తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్
భక్తులకు బీమా
Scroll for the next article