News25th Sep 05:29 PMSunil Byrisetty1 min read

34 లక్షల మంది మహిళలకు ఉచిత‌ వైద్య పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ప్రారంభమైన “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా సుమారు 34 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేసిన‌ట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి

34 లక్షల మంది మహిళలకు ఉచిత‌ వైద్య పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ప్రారంభమైన “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా సుమారు 34 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేసిన‌ట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. 16,000 పైగా వైద్య శిబిరాల ద్వారా మ‌హిళ‌లు ఉచిత ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నార‌న్నారు. మహిళలు 8 రకాల ఉచిత పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు. పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ జిల్లా నున్నలో ఏర్పాటు చేసిన “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” వైద్య శిబిరాన్ని మంత్రి సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు ర‌క్తపోటు, మ‌ధుమేహం, నోటి క్యాన్స‌ర్‌, రొమ్ము క్యాన్స‌ర్‌, గర్భాశ‌య ముఖద్వార క్యాన్స‌ర్ (స‌ర్విక‌ల్ క్యాన్స‌ర్‌), ఇతర స్క్రీనింగ్ పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. వ‌చ్చే నెల 2వ‌ తేదీ వర‌కు వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ శిబిరాల‌ ద్వారా మహిళలు, చిన్నారులు, బాల‌బాలిక‌ల‌కు కలిపి కోటిన్న‌ర‌ మందికి పైగా వైద్య‌ పరీక్షలు నిర్వ‌హించాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.
Andhra Pradesh
Health Camp
Women Health
Free Medical Checkup
Swast Naari
Healthcare
Medical Camp
Public Health
Women Empowerment
CM Initiative
వైద్య శిబిరం
ప్రజా ఆరోగ్యం
మహిళలకు ఉచిత‌ వైద్య పరీక్షలు
Scroll for the next article