News16th Dec 10:21 AMSunil Byrisetty1 min read

గుడివాడలో ఉచిత మెగా వైద్య శిబిరం

గుడివాడలో డిసెంబర్ 18, 2025 తేదీన గురువారం భారీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో 40 మందికి పైగా విభిన్న స్పెషాలిటీ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద

గుడివాడలో ఉచిత మెగా వైద్య శిబిరం
గుడివాడలో డిసెంబర్ 18, 2025 తేదీన గురువారం భారీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో 40 మందికి పైగా విభిన్న స్పెషాలిటీ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలతో పాటు అవసరమైన రోగులకు ఉచిత మందులు కూడా పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా టెనెట్ డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్ వారి సహకారంతో ప్రజలకు ఉచిత రక్త పరీక్షలు (ఫ్రీ బ్లడ్ టెస్టులు) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం డా. పోట్లూరి గంగాధర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హాల్, గుడివాడ (బస్ స్టాండ్ ఎదురు రోడ్డులో) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నాట్స్ (NATS) చైర్మన్ ప్రసాంత్ పిన్నమనేని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే రాము ఈ శిబిరంలో పాల్గొననున్నారు.
Indian Medical Association
Gudivada
Free Mega Medical Camp
Free Health Checkups
Free Blood Tests
Tenet Diagnostics
కైకలూరు ఎమ్మెల్యే
కామినేని శ్రీనివాస్
గుడివాడ ఎమ్మెల్యే రాము
ఆరోగ్య శిబిరం
Scroll for the next article