News19th Sep 03:59 PMSunil Byrisetty1 min read

ఉచిత ఇసుకతో సొంతింటి కల సాకారం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన ఉచిత ఇసుక పథకం బడుగు బలహీన వర్గాలకు ఉపాధిని కల్పించడంతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో తోడ్పాటును అందించింది. రెండేళ్ల

ఉచిత ఇసుకతో సొంతింటి కల సాకారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన ఉచిత ఇసుక పథకం బడుగు బలహీన వర్గాలకు ఉపాధిని కల్పించడంతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో తోడ్పాటును అందించింది. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 8,94,745 మంది ఇసుక పథకాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. 2,12,50,817 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను ఇప్పటివరకు సరఫరా చేశాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం కూడా వేగంగా ఊపందుకుంది. జగన్ హయాంలో ఉపాధి లేక ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైంది. లక్షలాది మంది కార్మికులు పనిలేక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారు. దాదాపు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఇసుక ధర భారీగా పెంచడంతో ఇళ్ల నిర్మాణం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పథకంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తిరిగి ఏపీకి వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఉచిత ఇసుక పథకంతో బడుగు బలహీన వర్గాల సొంతింటి కల స్వప్నాన్ని సాకారం చేసింది.
Scroll for the next article