News25th Jun 11:50 AMSunil Byrisetty1 min read
1 నుంచి శ్రీశైలంలో ‘ఉచిత స్పర్శ దర్శనం’
శ్రీశైల మహాక్షేత్రంలో స్పర్శ దర్శనం కోసం భక్తులు తహతహలాడుతుంటారు. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి శ్రీశైలంలో ‘ఉచిత స్పర్శ దర్శనం’ పునఃప్రారంభిస్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం మధ్యాహ్న
శ్రీశైల మహాక్షేత్రంలో స్పర్శ దర్శనం కోసం భక్తులు తహతహలాడుతుంటారు. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి శ్రీశైలంలో ‘ఉచిత స్పర్శ దర్శనం’ పునఃప్రారంభిస్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకూ ఉచిత దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ టోకెన్ల విధానం అమలు చేస్తారు. భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్‌తో టోకెన్లు జారీ అవుతాయి. రోజుకు 1,000–1,200 మందికి అవకాశం ఉంటుంది.