Jobs22nd Jan 12:57 PMSunil Byrisetty1 min read

ఈ నెల 27 నుంచి టాలీ కోర్సులో ఉచిత శిక్షణ

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఈనెల 27 నుంచి అకౌంటింగ్ టాలీ కోర్సులో ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జి జి.అంక

ఈ నెల 27 నుంచి టాలీ కోర్సులో ఉచిత శిక్షణ
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఈనెల 27 నుంచి అకౌంటింగ్ టాలీ కోర్సులో ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జి జి.అంకమ్మారావు తెలిపారు. బీకామ్/ఎంకామ్/బీబీఏ/ఎంబీఏ చదివి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు యువతీ యువకులు ఈ కోర్సు నేర్చుకునేందుకు అర్హులన్నారు. కోర్సు కాలవ్యవధి రెండు నెలలు ఉంటుందని, శిక్షణ పొందే అభ్యర్థులకు శిక్షణ, భోజన, వసతి సదుపాయా లు పూర్తిగా ఉచితమన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు నూరుశాతం ఉద్యోగావకాశాల కల్పనతో పాటు ఇ-మెటీరియల్, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆసక్తి గల యువత ఈనెల 25లోపు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ తదితర జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్సైజ్ ఫోటో లతో నేరుగా కార్యాలయానికి విచ్చేసి దరఖాస్తు చేసుకోవాల న్నారు. వివరాలకు 9100033552, 9346607845 నెంబర్లలో సంప్రదించాలని అంకమ్మారావు సూచించారు.
Krishna District
Unguturu Mandal
Atkur
Swarna Bharat Trust
Tally Course
Free Training
Youth Opportunities
Accounting Course
Job Placement
Scroll for the next article