Education6th Oct 03:39 PMSunil Byrisetty1 min read

యు.పి.ఎస్.సి. సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్

రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సంచాలకులు ఆదేశాల మేరకు యు.పి.ఎస్.సి. సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతు

యు.పి.ఎస్.సి. సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సంచాలకులు ఆదేశాల మేరకు యు.పి.ఎస్.సి. సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి ఇ.జగ్గయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన బి.సి., ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి చేసి, బయోడేటాతో పాటు 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, విద్యార్హత, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు లేదా తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తదితర పత్రాల జిరాక్స్ కాపీలను అటెస్టేషన్ చేయించి దరఖాస్తుకు జతపరచి, అక్టోబర్ 20లోపు సంబంధిత చిరునామాలో నేరుగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఖాళీ దరఖాస్తు ఫారాలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ స్టడీ సర్కిల్ వద్ద ఉచితంగా పొందవచ్చని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ప్రాతిపదికన జరుగుతుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు బి.సి. భవన్, గొల్లపూడి, విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ఉచిత బస, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ & ఎ.పి. బి.సి. స్టడీ సర్కిల్, 74-2-1/5, పండరిపురం, విజయవాడ – 520007 నందు సంప్రదించాలని లేక సెల్ నంబర్లు 9505094349, 9966849937, 8688855255 నందు కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
Scroll for the next article