Education23rd Nov 03:04 PMSunil Byrisetty1 min read

ఎస్సీ, ఎస్టీ యువతకు సివిల్స్ కోచింగ్

ఏపీలోని ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఐఏఎస్ వి.ప్రసన్న వెంకటేష్ ప

ఎస్సీ, ఎస్టీ యువతకు సివిల్స్ కోచింగ్
ఏపీలోని ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఐఏఎస్ వి.ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు.విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2025 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30.11.2025 న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
Andhra Pradesh
SC/ST Youth
Free UPSC Coaching
Ambedkar Study Circle
Civil Services Exam
Preliminary Exam Training
తిరుపతి
ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్
ప్రభుత్వ ప్రాజెక్ట్
ఆన్‌లైన్ దరఖాస్తు
మహిళలకు రిజర్వేషన్
Scroll for the next article