Telangana5th Dec 03:13 PMSunil Byrisetty1 min read

సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థులు ఉచిత హామీలతో ప్రచారం చేస్తున్నారు. తమను సర్పంచ్ గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల

సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థులు ఉచిత హామీలతో ప్రచారం చేస్తున్నారు. తమను సర్పంచ్ గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని హామీ ఇచ్చిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి పై హామీలతో కూడిన బాండ్ రాసిచ్చారు. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్థులకు తెలియజేస్తానని పేర్కొన్నారు. గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు. ఈ హామీలను చూసి ప్రజలు ఔరా ఎన్నికల చిత్రాలు అనుకుంటున్నారు.
Telangana
Panchayat Elections
Mulugu District
Eturunagaram
Sarpanch Candidate
Dhanalakshmi
Chakravarthy
Unusual Promises
Free WiFi
Free TV Channels
బీజేపీ
గ్రామాభివృద్ధి
ఎన్నికల ప్రచారం
ప్రజల ప్రతిస్పందన
Scroll for the next article