News20th Sep 11:28 AMSunil Byrisetty1 min read

మంగళగిరిలో ఉచిత యోగ శిక్షణ

మంగళగిరిలోని శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం ఆధ్వర్యంలో నూతన ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు శిబిరం ప్రారంభం కానుంది. మంగళగిరి

మంగళగిరిలో ఉచిత యోగ శిక్షణ
మంగళగిరిలోని శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం ఆధ్వర్యంలో నూతన ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు శిబిరం ప్రారంభం కానుంది. మంగళగిరిలోని భార్గవ్ పేట పరిధి కూరగాయల మార్కెట్ వెనుక శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం వారి యోగ ఆశ్రమంలో, శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాలుగు వారాల పాటు జరిగే శిక్షణలో 42 రకాల యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, యోగ ముద్రలు, ఆరోగ్య నియమాలు నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని నిర్వాహకులు కోరారు. శిబిరంలో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8985111877, 9441570582. నెంబర్లకు సంప్రదించి తెలుసుకోవచ్చునని సూచించారు.
Scroll for the next article