Politics13th Jul 03:58 PMSunil Byrisetty1 min read

జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ..!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం, 'ఊరు-వాడ' పేరుతో రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు ప్రారంభం కా

జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ..!
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం, 'ఊరు-వాడ' పేరుతో రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి తాజ్ హోటల్‌లో ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తమిళనాడు విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పేదలు, వెనుకబడిన వర్గాల కోసమే 'ఊరు-వాడ' పేరుతో సేవా కార్యక్రమాలు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు చెబుతున్నాయి. 'ఊరు-వాడ' కార్యక్రమానికి, తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదని పేర్కొంటున్నాయి.
Andhra Pradesh
Telugu Politics
NTR Press Meet
Jr NTR
Nandamuri Taraka Rama Rao Jr
Political Entry
Ooru Vaada
ఎన్టీఆర్ అభిమానులు
టాలీవుడ్
తెలుగు వార్తలు
బ్రేకింగ్ న్యూస్
Scroll for the next article