News18th Dec 11:41 AMSunil Byrisetty1 min read
మరోసారి సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు?
మావోయిస్టుల అస్తిత్వ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నా యి. భద్రతా బలగాలు, మావోయి
మావోయిస్టుల అస్తిత్వ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నా యి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మహిళ ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇరుపక్షాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది.