Entertainment2nd Sep 12:29 PMSunil Byrisetty1 min read
సినిమా నుంచి రాజకీయాల్లోకి.. నాయకుడిగా జనసేనాని!
సినీ నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులు గెలుచుకున్న వారు కొందరే.ఎంజిఆర్, ఎన్టీఆర్, జయలలిత బలమైన నాయకులుగా నిలిచి గెలిచారు. అయితే ఒక పక్క సినిమాలు చేస్తూ ఇంకోవైపు ప
సినీ నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులు గెలుచుకున్న వారు కొందరే.ఎంజిఆర్, ఎన్టీఆర్, జయలలిత బలమైన నాయకులుగా నిలిచి గెలిచారు. అయితే ఒక పక్క సినిమాలు చేస్తూ ఇంకోవైపు ప్రజా సేవలో ఎలాంటి లోపము జరగకుండా చూసుకోవడం కత్తి మీద సాము లాంటిది. దాన్ని సాధించిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ చరిత్రను తిరగరాశారు.
చిరంజీవి తమ్ముడు, మెగా ఫ్యామిలీ అనే బ్రాండ్ నుంచి తనదైన ఇమేజీని క్రియేట్ చేసుకున్న పవన్ పవర్ స్టార్ గా ఎదిగారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమాలతో న్యూ హిస్టరీ క్రియేట్ చేశారు. పవర్ స్టార్ గా అసమానమైన క్రేజ్ సంపాదించిన పవన్ సమాజానికి ఏదో చేయాలనే తపనే 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆదిలో పరాజయం ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందడుగులు వేశారు. పార్టీని బలోపేతం చేసి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు. బాధ్యత గుర్తించిన వాడే సరైన నాయకుడవుతాడని చెప్పడానికి పవన్ కళ్యాణే ఉదాహరణ. ఆయన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్!