News19th Sep 04:31 PMSunil Byrisetty1 min read
భయం నుంచి భరోసా.. నిరాశ నుంచి కొత్త ఆశలకు!
విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2019-24 మధ్య అరాచక పాలన సాగింది.. గత పాలకులు మద్యం కుంభకోణానికి పాల్పడ్
విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2019-24 మధ్య అరాచక పాలన సాగింది.. గత పాలకులు మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలోనూ పాపానికి ఒడిగట్టారన్నారు. విశాఖలో భూ వివాదాలు, కబ్జాలు, ఇళ్ల కూల్చివేతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహించారు. రుషికొండలో ప్రజాధనంతో విలాసవంతమైన భవనం నిర్మించారు.. త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భూ కబ్జాలకు బదులుగా, అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, డేటా సెంటర్ల ఏర్పాటును అడ్డుకునేందుకు YCP కోర్టులను ఆశ్రయిస్తోందని మండిపడ్డారు. 'విధ్వంసం నుంచి వికాసం.. భయం నుంచి భరోసా.. నిరాశ నుంచి కొత్త ఆశల వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని' సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.