Business Type13th Apr 11:59 AMSunil Byrisetty1 min read

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పుడంటే?

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల పెట్రో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉ

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పుడంటే?
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల పెట్రో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ లీటర్ సగటు ధర రూ. 110-112, డీజిల్ రూ. 98-100 మధ్య ఉంది. తెలంగాణలో పెట్రోల్ ధర రూ. 108-110, డీజిల్ ధర రూ. 96-98 మధ్య ఉంది. చమురు ధరల పతనంతో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 3-5, డీజిల్ ధర రూ. 2-4 వరకు తగ్గే అవకాశం ఉంది. రాబోయే 2-3 వారాల్లో తగ్గుదల అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, వ్యాట్లలో మార్పులు చేస్తేనే, ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వాలు పన్నులు తగ్గించకుండా ప్రజలపై భారం వేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి
india
global oil price decline
fuel
అంతర్జాతీయం
పెట్రో ధరలు తగ్గే అవకాశాలు
Scroll for the next article