News4th Oct 10:07 AMSunil Byrisetty1 min read

నేడు 'ఆటో డ్రైవర్ల సేవలో' నిధుల జమ

ఏపీలోని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం ఆర్థిక సాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప

నేడు 'ఆటో డ్రైవర్ల సేవలో' నిధుల జమ
ఏపీలోని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం ఆర్థిక సాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమ గిరాకీ గణనీయంగా తగ్గిపోయి, కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దసరా పండుగ సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,90,669 మంది డ్రైవర్లను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరి ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.436 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
Andhra Pradesh
Auto Drivers Scheme
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
BJP Madhav
Financial Assistance
రూ.436 కోట్లు జమ
ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లు
Scroll for the next article