News5th Jul 08:53 AMSunil Byrisetty1 min read
పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు!
దేశంలో పలు ప్రభుత్వ పాఠశాలలను పీఎం శ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 855 పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులను విడుదల చేస్తూ స
దేశంలో పలు ప్రభుత్వ పాఠశాలలను పీఎం శ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 855 పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులను విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతగా 50% నిధులు విడుదల చేసింది.
విద్యార్థుల సంఖ్య 100 వరకు, అంతకన్నా తక్కువగా ఉంటే రూ. 4.75 లక్షలు ఇస్తోంది. అదే విద్యార్థుల సంఖ్య 250 వరకు ఉంటే రూ. 17.62 లక్షలు విడుదల చేస్తోంది. వెయ్యి వరకు ఉంటే రూ. 36.8 లక్షలు, వెయ్యి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే రూ. 39 లక్షలు చొప్పున విడుదల చేసింది.