News13th Dec 12:15 PMSunil Byrisetty1 min read
విద్యార్థుల కిట్ల కోసం నిధులు మంజూరు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరంలో కిట్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరంలో కిట్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రూ. 830.04 కోట్ల నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తోంది. నోట్ బుక్లు, బెల్ట్, షూలు, బ్యాగ్, డిక్షనరీలు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫాం క్లాత్ లను ఇవ్వనుంది. కిట్ల సేకరణ, పంపిణీ కోసం రూ. 157.20 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా, పంపిణీ దారులను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.