News6th May 04:58 PMSunil Byrisetty1 min read
గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ జైలు.. సీబీఐ కోర్టు తీర్పు!
ఓబులాపురం మైనింగ్ కేసుపై సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పుని
ఓబులాపురం మైనింగ్ కేసుపై సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.
ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ఐదుగురికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
అలాగే మరో ఇద్దరిని నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది.
ఈ కేసులో ఇప్పటికే ఒకరు మృతి చెందారు.
గతంలో జైలు శిక్షననుభవించిన ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసు కొట్టేసింది.
OMC కేసులో కృపానంద, 2004-2009 వరకు గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిలకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఓబులాపురం మైనింగ్ కేసులో దోషులుగా OMC కంపెనీ, గాలిజనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, గాలి పీఏ మెఫజ్ అలీఖాన్ లను నిర్ధారించింది.
ఇక, ఏ1 శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డిలకి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.