Crime29th Mar 09:03 AMSunil Byrisetty1 min read
గాలి కేసులో తుది తీర్పు మే 6న
ఓబుళాపురం గనుల కేసులో సుప్రీంకోర్టు జోక్యంతో సుదీర్ఘ విచారణ ఎట్టకేలకు తుది దశకు వచ్చింది. అనంతపురం జిల్లాలో ఓబుళాపురం, అంతరగంగమ్మ ప్రాంతాల్లో 95 హెక్టార్లలో ఇనుప ఖనిజం తవ్వకాలు, రవ
ఓబుళాపురం గనుల కేసులో సుప్రీంకోర్టు జోక్యంతో సుదీర్ఘ విచారణ ఎట్టకేలకు తుది దశకు వచ్చింది.
అనంతపురం జిల్లాలో ఓబుళాపురం, అంతరగంగమ్మ ప్రాంతాల్లో 95 హెక్టార్లలో ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణ, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఓబుళాపురం గనుల కేసు విచారణ సుమారు పదమూడున్నర సంవత్సరాలు కొనసాగింది.
విచారణలో న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారణ జరిపి, 3400కు పైగా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది.
వాదనలు పూర్తి కావడంతో మే 6న తీర్పు ఇవ్వనున్నట్లు హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ప్రకటించింది.
కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా నిందితుల భవితవ్యం తేలనుంది.
ఓఎంసీ కేసులో 2011లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపైన కేసు నమోదైన విషయం తెలిసిందే. 13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఓఎంసీ కేసుపై నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని న్యాయస్థానం నిందితులుగా పేర్కొంది.
ఇదే కేసులో మరో ఐదుగురు నిందితులను చేర్చింది . మొత్తం ఏడుమంది నిందితులపై న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది.