Politics20th Jul 12:06 PMSunil Byrisetty1 min read

అంబటిపై పరువు నష్టం దావా వేస్తున్నా

రాజకీయ లబ్ధి కోసం మహిళపై జరిగిన ఘటనను వాడుకోవడం దుర్మార్గమని 'గుంటూరు పశ్చిమ' ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేత అంబటి ర

అంబటిపై పరువు నష్టం దావా వేస్తున్నా
రాజకీయ లబ్ధి కోసం మహిళపై జరిగిన ఘటనను వాడుకోవడం దుర్మార్గమని 'గుంటూరు పశ్చిమ' ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేత అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. గుంటూరులో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై వెంటనే స్పందించామన్నారు. పోలీసులు, మహిళా కమిషన్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయవద్దని హితవు పలికారు.
Andhra Pradesh
AP politics
Galla Madhavi
Ambati Rambabu
Defamation
Guntur West
TDP
YSRCP
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
మహిళ భద్రత
Scroll for the next article