News30th Mar 11:27 AMSunil Byrisetty1 min read

ఉగాది సందర్బంగా సెక్రటేరియట్లో ఆటల పోటీలు

ఉగాది పండుగ-2025 శుభ సందర్బాన్ని పురస్కరించుకొని ఏపీ యస్పియఫ్ డిజీ డా. త్రివిక్రమ్ వర్మ, ఐజీ బి వి రామిరెడ్డి సూచనల మేరకు విజయవాడ జోన్ కమాన్ డెంట్ ముద్దాడ శంకర రావు ఆధ్వర్యంలో ఏపి

ఉగాది సందర్బంగా సెక్రటేరియట్లో ఆటల పోటీలు
ఉగాది పండుగ-2025 శుభ సందర్బాన్ని పురస్కరించుకొని ఏపీ యస్పియఫ్ డిజీ డా. త్రివిక్రమ్ వర్మ, ఐజీ బి వి రామిరెడ్డి సూచనల మేరకు విజయవాడ జోన్ కమాన్ డెంట్ ముద్దాడ శంకర రావు ఆధ్వర్యంలో ఏపి సెక్రటేరియట్ CSO పి. వి. ఎస్. ఎన్.మల్లికార్జున రావు పర్యవేక్షణలో ఏపి సెక్రటేరియట్ అమరావతిలో గత రెండు రోజులుగా వాలీబాల్ మరియు బాడ్మింటన్ ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కమాండంట్ ముద్దాడ శంకరర్రావు మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడితో ఉండే యస్పియఫ్ సిబ్బంది ఈ ఆటల పోటీల వలన వారు శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన జట్లకు, విజేతలకు విజయవాడ జోన్ కమాండంట్ ముద్దాడ శంకర రావు ట్రోఫీలు, మెడల్స్ మెమెంటోలు, సర్టిఫికెట్స్ అందజేశారు.
Vijayawada
Secretariat
Games competitions
CSO పి. వి. ఎస్. ఎన్.మల్లికార్జున
Scroll for the next article