Electronics6th Jun 01:40 PMSunil Byrisetty1 min read

బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ పీసీలు, ఆలిన్ వ‌న్ డెస్క్‌టాప్‌లు!

గేమింగ్ పీసీలు లేదా ఆలిన్ వ‌న్ డెస్క్‌టాప్‌ల‌ కోసం చూస్తున్నారా? అసుస్ స‌రికొత్త‌గా లాంచ్ చేసిన పీసీల‌ు సరిగ్గా సరిపోతాయి. బ‌డ్జెట్ ధ‌ర‌లోని ఈ పీసీలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను క‌లిగి

బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ పీసీలు, ఆలిన్ వ‌న్ డెస్క్‌టాప్‌లు!
గేమింగ్ పీసీలు లేదా ఆలిన్ వ‌న్ డెస్క్‌టాప్‌ల‌ కోసం చూస్తున్నారా? అసుస్ స‌రికొత్త‌గా లాంచ్ చేసిన పీసీల‌ు సరిగ్గా సరిపోతాయి. బ‌డ్జెట్ ధ‌ర‌లోని ఈ పీసీలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయి. అసుస్ టీయూఎఫ్ గేమింగ్ టి500 డెస్క్‌టాప్‌ ఇంటెల్ కోర్ ఐ5-13420హెచ్ ప్రాసెస‌ర్‌, ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3050 జీపీయూతోపాటు 16జీబీ ర్యామ్‌, 1టీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ఈ పీసీలో యూజ‌ర్లు ర్యామ్‌ను 64జీబీ వ‌ర‌కు, స్టోరేజ్‌ను 4టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. వైఫై 6, బ్లూటూత్ 5.4కు స‌పోర్ట్‌ను ఈ పీసీల్లో అందిస్తున్నారు. విండోస్ 11 హోమ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఈ పీసీలో పొంద‌వ‌చ్చు. అలాగే వి440వీఏ, వి470 వీఏ ఆలిన్ వ‌న్ పీసీల‌ను కూడా అసుస్ లాంచ్ చేసింది. వి440వీఏ ఆలిన్ వన్ పీసీలో 24 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఇన్‌బిల్ట్‌గా ల‌భిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5-13420హెచ్ ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. 16జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీని అందిస్తున్నారు. మరో మోడల్ వి470వీఏ ఆలిన్ వ‌న్ పీసీలో 27 ఇంచుల డిస్‌ప్లే ఇన్‌బిల్ట్‌గా వ‌స్తుంది. ఇంటెల్ కోర్ ఐ7-13620హెచ్ ప్రాసెస‌ర్‌, 16జీబీ ర్యామ్‌, 1టీబీ ఎస్ఎస్‌డీని ఏర్పాటు చేశారు. ర్యామ్, స్టోరేజ్‌ల‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు. వీటిలో విండోస్ 11 హోమ్ ఓఎస్‌ను ఇస్తున్నారు. ఇక ఇత‌ర అన్ని ర‌కాల పోర్టులు కూడా ఉన్నాయి. ఆర్‌వోజీ జి700 పీసీ ధ‌ర రూ.3,59,990 ఉండ‌గా, టీయూఎఫ్ గేమింగ్ టి500 పీసీ ధ‌ర రూ.84,990గా ఉంది. వి440వీఏ పీసీ ధ‌ర రూ.49,990 ఉండ‌గా, వీ470వీఏ ఆలిన్ వ‌న్ పీసీ ధ‌ర రూ.51,990గా ఉంది.
Desktop
gaming PCs
Asus TUF Gaming T500 desktop
Windows 11
అసుస్ టీయూఎఫ్ గేమింగ్ టి500 డెస్క్ టాప్
Scroll for the next article