Spiritual9th Jan 03:09 PMSunil Byrisetty1 min read
అమ్మవారి ఆలయంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన స్వామివారి
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన స్వామివారికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్, అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి జీ జగన్మాతను దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం వేద పండితులు స్వామివారికి వేదాశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వామివారిని సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇతర ఆలయ అధికారులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి రాకతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.