News30th Sep 01:44 PMSunil Byrisetty1 min read

సీఎం పర్యటనకు సిద్ధమవుతున్న గాంధీ హిల్

విజయవాడకు మణిహారమైన గాంధీ హిల్ మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేశార

సీఎం పర్యటనకు సిద్ధమవుతున్న గాంధీ హిల్
విజయవాడకు మణిహారమైన గాంధీ హిల్ మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా, వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్‌లతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ అక్కడి పనులను పర్యవేక్షించారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొండపైకి వెళ్లే రోడ్ విస్తరణ, లిఫ్ట్ నిర్మాణం, రైల్వే ట్రాక్ అభివృద్ధి, పార్క్ సౌకర్యాలు వంటి పనుల పురోగతిని ఎంపీ సమీక్షించారు. సౌకర్యాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీ హిల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేపీసీ గాంధీ, వైస్ చైర్మన్ జంద్యాల శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Vijayawada
Gandhi Hill
CM N. Chandrababu Naidu
Tourism Development
Infrastructure
Road Expansion
Lift Construction
Park Facilities
MP Kesineni Srinivas
గాంధీ హిల్
సీఎం నారా చంద్రబాబు నాయుడు
పర్యాటక అభివృద్ధి
Scroll for the next article