News14th Dec 11:23 AMSunil Byrisetty1 min read
సిక్కోలులో గంజాయి స్వాదీనం
శ్రీకాకుళం జిల్లా కంచిలి రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి గంజాయిని కంచిలి ఎస్సై పారినాయుడు స్వాదీనం చేసుకున్నారు. కంచిలి మండలంలో ఒరిస్
శ్రీకాకుళం జిల్లా కంచిలి రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి గంజాయిని కంచిలి ఎస్సై పారినాయుడు స్వాదీనం చేసుకున్నారు. కంచిలి మండలంలో ఒరిస్సాకు చెందిన మిలన్ మిచెల్, దీప బిషి అనే ఇద్దరు వ్యక్తులు 24 కేజీల గంజాయిని ద్విచక్ర వాహనం పై తరలిస్తుండగా రైల్వే స్టేషన్ వద్ద ఎస్సై పారి నాయుడు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ గంజాయిని ముంబైకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సీఐ మంగరాజు మాట్లాడుతూ ఎస్సై సమయస్ఫూర్తితో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేశారని ఎస్సైని అభినందించారు. గంజాయి నిరోధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.