News8th Sep 03:20 PMSunil Byrisetty1 min read
చెత్త తరలింపు వేగవంతం
అనంతపురం డంపింగ్ యార్డులో చెత్త తరలింపు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే 60 శాతం చెత్త తొలగించామని, అక్టోబర్ 2 నాటికి యార్డులో చెత్త పూర్తిగా లేకుండా చే
అనంతపురం డంపింగ్ యార్డులో చెత్త తరలింపు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే 60 శాతం చెత్త తొలగించామని, అక్టోబర్ 2 నాటికి యార్డులో చెత్త పూర్తిగా లేకుండా చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి 85 లక్షల టన్నుల చెత్త పేరబెట్టిందని ఆయన విమర్శించారు. చెత్త తొలగించిన చోట అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అమృత్, స్వచ్చభారత్ పథకాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, కేంద్ర నిధులను సద్వినియోగం చేయలేదని ఆరోపించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ పనులు వేగంగా సాగుతున్నాయని, 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నా సూపర్ సిక్స్ పథకాలను విజయవంతం చేశామని మంత్రి తెలిపారు.