News8th Jan 05:53 PMSunil Byrisetty1 min read

త్వరలో ‘గరుడ’కు శ్రీకారం

త్వరలో గరుడ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి సవితతో బ

త్వరలో ‘గరుడ’కు శ్రీకారం
త్వరలో గరుడ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చిరాంప్రసాద్ భేటీ అయి గరుడ పథకం విధివిధానాలపై చర్చించారు. గరుడ పథకం కింద నిరుపేదలైన బ్రాహ్మణులు మృతి చెందితే రూ.10 వేల ఆర్థిక సాయం అందివ్వనున్నట్లు వెల్లడించారు. బ్రాహ్మణుల్లో పేదరిక నిర్మూలనకు 2014లోనే సీఎం చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలను అమలు చేస్తూ, బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా కల్పనకు కృషి చేశారన్నారు. 2014-19లో భారతి, భారతీ విదేశీ విద్య, గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణమస్తు, కశ్యప, గరుడ వంటి పది పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల పథకాన్ని మొదట అమలు చేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
Andhra Pradesh
Garuda Scheme
Minister S. Savita
Brahmin Corporation
K. Buchhi Ramprasad
Chandrababu Naidu
ఆర్థిక సాయం
బ్రాహ్మణ సంక్షేమం
అమరావతి సచివాలయం
Scroll for the next article