TTD19th Sep 04:26 PMSunil Byrisetty1 min read
నేడు శ్రీవారికి గరుడ సేవ.. కొండంతా భక్త జనం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరుగుతోంది. ఈ వేడుకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకున్నారు. 190 గ్యాలరీల్లో
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరుగుతోంది. ఈ వేడుకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకున్నారు. 190 గ్యాలరీల్లో 1.80 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా చూసి తరించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. పురాణాల ప్రకారం శ్రీవారి గరుడ సేవను వీక్షించడానికి ముక్కోటి దేవతలు తిరుమలకు తరలి వస్తారని విశ్వాసం. అందుకే ఈ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 3,000 మంది పోలీసులు, 2,500 మంది విజిలెన్స్ సిబ్బందిని మోహరించారు. బ్రహ్మోత్సవాల గరుడ సేవ కోసం చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి సమర్పించిన 9 పవిత్ర గొడుగులను తిరుమలలో టీటీడీ అధికారులకు అందజేశారు. వరుసగా 22వ సారి ఈ గొడుగులను సమర్పించడం విశేషం.