Health5th Sep 03:19 PMSunil Byrisetty1 min read

గిరిజనుల జన్యు వ్యాధులపై అప్రమత్తం

రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యానికి మరింత భరోసా పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్‌ వంటి జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించేందు

గిరిజనుల జన్యు వ్యాధులపై అప్రమత్తం
రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యానికి మరింత భరోసా పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్‌ వంటి జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ కంపిటెన్స్‌ (సీఓసీ) ల్యాబ్‌ ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఈ కేంద్రం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ప్రాంతీయ నిర్ధారణ కేంద్రంగా సేవలందిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యేక దృష్టితో గిరిజన ప్రాంతాల ప్రజలకు అధునాతన వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజీహెచ్ లో ఉన్న కేంద్రంలో ఇటీవల వరకు 121 రక్త నమూనాలను పరీక్షించగా, 94 నమూనాల్లో జన్యుపరమైన హీమోగ్లోబిన్‌ వైవిధ్యాలు లేదా క్యారియర్‌ స్థితులు గుర్తించారు. పరీక్షలు, జన్యు సలహాలు, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
Andhra Pradesh Health
Tribal Health
Genetic Disorders
Sickle Cell Disease
Thalassemia
KGH Visakhapatnam
Centre of Competence
Genetic Blood Disorders
సికిల్ సెల్ పరీక్షలు
జన్యు సలహాలు
సత్యకుమార్ యాదవ్
గిరిజన సంక్షేమం
విశాఖపట్నం
ఉత్తరాంధ్ర
Scroll for the next article