Politics4th Aug 03:59 PMSunil Byrisetty1 min read
జెన్-జీకి అండగా జెన్-జే
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కక్షసాధింపులకు గురవుతున్న బాధితుల పక్షాన జెన్-జే (జనరేషన్ జగన్) రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కక్షసాధింపులకు గురవుతున్న బాధితుల పక్షాన జెన్-జే (జనరేషన్ జగన్) రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. పాదయాత్రలో ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వం చెల్లించిన మొత్తం అందులో స్వల్ప భాగమేనని, మిగిలిన బకాయిలను ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు కళాశాలల్లో సర్టిఫికెట్లు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నిరుద్యోగ భృతి హామీని కూడా పూర్తిగా గాలికొదిలేశారని, యువతకు ఇచ్చిన ఈ హామీలపై లోకేష్ సమాధానం చెప్పాలని జెన్-జీకి అండగా జెన్-జే నిలుస్తుందని స్పష్టం చేశారు.