Telangana5th Jun 12:35 PMSunil Byrisetty1 min read

ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే!

ఇకపై హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాలని ప్రభుత్వం పేర్కొంది. ఖాళీ ప్లాట్‌లలో జీహెచ్ఎంసీ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్

ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే!
ఇకపై హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాలని ప్రభుత్వం పేర్కొంది. ఖాళీ ప్లాట్‌లలో జీహెచ్ఎంసీ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న సర్కార్ ఖాళీ స్థలాలపై దృష్టి పెట్టింది. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్‌టీ) చెల్లించాలని.. భూమి ధర మార్కెట్ ధరలో 0.05 శాతం వీఎల్‌టీ చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్‌టీ చెల్లించాల్సిన ప్లాట్లు 31 వేల వరకు ఉండగా.. వీఎల్‌టీ వసూలైతే దాదాపు రూ.110 కోట్ల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్‌టీ చెల్లించకపోతే బకాయిలున్నట్లు ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Telangana News
ghmc
land tax
open plots
ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే
ఖాళీ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ జీహెచ్‌ఎంసీ కమిషనర్
Scroll for the next article