Telangana8th Aug 04:00 PMSunil Byrisetty1 min read
వరద సమస్యకు చెక్.. హైదరాబాదులో స్మార్ట్ ప్లాన్
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను వరద సమస్య వెంటాడుతోంది. చిన్నపాటి వర్షానికీ నగరం నీట మునుగుతోంది. అదే భారీ వర్షం పడితే నగరం చెరువులను తలపిస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరి ప్రజలు నరకయా
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను వరద సమస్య వెంటాడుతోంది. చిన్నపాటి వర్షానికీ నగరం నీట మునుగుతోంది. అదే భారీ వర్షం పడితే నగరం చెరువులను తలపిస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో ప్రభుత్వం హైదరాబాద్‌లో వరద నియంత్రణ కోసం 'స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్' సిద్ధం చేసేందుకు జీవో విడుదల చేసింది. దీర్ఘకాలిక పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ ప్రణాళిక తయారు చేయనుంది. మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అర్హత కలిగిన కన్సల్టెంట్లను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. మూసీ నది, హుస్సేన్ సాగర్ వల్ల ఏర్పడే వరదలను నివారించడంతో పాటు వరద నీటి కాలువలలో ఇతర వ్యర్థ జలాలు కలవకుండా చర్యలు తీసుకునేలా ప్లాన్ రూపొందిచనున్నారు.