News4th Sep 11:42 AMSunil Byrisetty1 min read
మంగళగిరిలో ఆత్మల పింఛన్లు!
మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ప్రతి నెల ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వాడు. ఆయన గత ఏడు నెలల క్రితమే మృతి చెందాడు. కానీ ఆయన బ్యాంక్ ఖాతాకు నెలకు ర
మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ప్రతి నెల ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వాడు. ఆయన గత ఏడు నెలల క్రితమే మృతి చెందాడు. కానీ ఆయన బ్యాంక్ ఖాతాకు నెలకు రూ. 80 వేల చొప్పున క్రమం తప్పకుండా నగదు జమైంది. ఆ మొత్తాన్ని ఆ వ్యక్తి కుటుంబీకులు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత బ్రతికున్నంత కాలం సదరు ఉద్యోగికి పెన్షన్ చెల్లిస్తారు. ఒక వేళ ఏదైనా కారణాలతో ఉద్యోగి మృతి చెందితే.. తరువాత ఆయన భార్యకు సగభాగం పెన్షన్ ఆమె బ్రతికి ఉన్నంతకాలం చెల్లిస్తారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందినా కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు తెలియపరచకుండా గుట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి పెన్షన్ లను కొందరు కుటుంబీకులు గుట్టుగా డ్రా చేసుకోవడం విస్తు గొలుపుతోంది. ఒక్క మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోనే పలువురు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులు కోట్ల రూపాయల పెన్షన్ డ్రా చేసినట్లు సమాచారం.