News10th Aug 11:32 AMSunil Byrisetty1 min read

అర టన్ను సొర.. ధర అదిరింది!

వర్షాకాలం మత్స్యకారుల పంట పండిస్తోంది. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకారుల గాలానికి భారీ సొర చేప చిక్కింది. దాన్ని చూసి తొలుత భయపడిన మత్స్యకారులు 5 గంటలపాటు కష్టపడి తీరానిక

అర టన్ను సొర.. ధర అదిరింది!
వర్షాకాలం మత్స్యకారుల పంట పండిస్తోంది. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకారుల గాలానికి భారీ సొర చేప చిక్కింది. దాన్ని చూసి తొలుత భయపడిన మత్స్యకారులు 5 గంటలపాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు. సొరను పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి లాక్కొచ్చారు. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొరను వేలం వేయగా రూ.34 వేలు పలికింది. ఓ స్థానిక వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారుడు మడ్డు నూకరాజు తెలిపారు. అరుదుగా ఇలాంటివి దొరుకుతాయని చెబుతున్నారు.
Andhra Pradesh Coast
Pudimadaka
Anakapalli
Shark Catch
Fishermen
Monsoon Fishing
500 kg Shark
15-foot Shark
Rare Catch
Fishing Auction
అనకాపల్లి
సొరచేప
మత్స్యకారులు
Scroll for the next article