Health18th Aug 10:25 AMSunil Byrisetty1 min read
ఆరోగ్యాన్ని బాగు చేసే అల్లం టీ
అల్లం టీ నిత్యం తీసుకోవడం ఔషధంలా పని చేస్తుంది. అది జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. తీసుకున్న ఆహారం కడుపులో నుంచి త్వరగా చిన్న పేగుల్లోకి సాగేలా చేయడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్
అల్లం టీ నిత్యం తీసుకోవడం ఔషధంలా పని చేస్తుంది. అది జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. తీసుకున్న ఆహారం కడుపులో నుంచి త్వరగా చిన్న పేగుల్లోకి సాగేలా చేయడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. వరల్డ్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధ్యయనం ప్రకారం.. అల్లం జీర్ణాశయ కండరాల కదలికలను వేగవంతం చేసి ఆహారాన్ని త్వరగా ముందుకు నెట్టేస్తుంది. ఆయుర్వేద నిపుణులు సైతం అల్లాన్ని జీర్ణకోశ సమస్యలను నివారించే ఉత్తమ సహజ టానిక్‌గా అభివర్ణిస్తున్నారు. భోజనం ముగిసిన వెంటనే కడుపు బండరాయిలా భారంగా అనిపించే సమస్యతో బాధపడేవారికి అల్లం గొప్ప పరిష్కారం. అల్లం టీ నేరుగా కొవ్వును కరిగించలేకపోయినా.. శరీర కొలతల్లో మార్పులు తెచ్చేందుకు సహాయపడుతుంది. అతిగా చక్కెర, తేనె కలపకుండా తేలికపాటి కషాయంలా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి.అల్లం టీ ద్వారా పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే తాజా అల్లం ముక్కలను నీటిలో బాగా మరిగించి తయారుచేయాలి.