Spiritual3rd Jan 12:03 PMSunil Byrisetty1 min read

పుష్య పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ

ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత, మల్లేశ్వరుడు, వారి సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిర

పుష్య పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత, మల్లేశ్వరుడు, వారి సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు సెలవిచ్చిన ప్రకారం శనివారం ఉదయం పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభించారు. అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి,కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.
Pushya Pournami
Giri Pradakshina
Indrakeeladri
Kanaka Durga Temple
Vijayawada
Malleshwara Swamy
పౌర్ణమి పర్వదినం
హిందూ సంప్రదాయం
Scroll for the next article