Crime6th Apr 10:30 AMSunil Byrisetty1 min read

నడుస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి.. వీడియో చిత్రీకరణ

నడుస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి జరిగింది. కుటుంబంతో కలిసి సంబల్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఓ బాలికపై రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘోరం జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్

నడుస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి.. వీడియో చిత్రీకరణ
నడుస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి జరిగింది. కుటుంబంతో కలిసి సంబల్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఓ బాలికపై రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘోరం జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఆ ఘటనను వీడియో తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కుటుంబం ప్రయాణిస్తున్న కోచ్‌లోనే బీహార్‌లోని మంద్వాడ్ జిల్లా ఖజోలి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్(21) ప్రయాణిస్తున్నాడు. రైలు కేల్తార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాలిక టాయిలె‌ట్‌లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన సంతోష్ కుమార్ కూడా వెంటే వెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనను తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు కూడా తీశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో, తండ్రి వెంటనే 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటన ఇటార్సీ రైల్వే స్టేషన్‌ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు.
Secunderabad
Train
girl child sexually assaulted
సంబల్‌పూర్
రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌
Scroll for the next article