Education7th Dec 09:26 AMSunil Byrisetty1 min read

ఎంబీబీఎస్ లో 60.72% సీట్లు అమ్మాయిలవే!

ఎంబీబీఎస్ లో 60.72% అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66% అమ్మాయిల ప్

ఎంబీబీఎస్ లో 60.72% సీట్లు అమ్మాయిలవే!
ఎంబీబీఎస్ లో 60.72% అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66% అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు ఇటీవల ముగిశాయి. వీటి వివరాలను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికారెడ్డి మంత్రి సత్యకుమార్ కు నివేదించారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది చొప్పున అమ్మాయిలు ఎంబీబీఎస్ లో చేరినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పాఠశాల విద్య నుంచే అమ్మాయిలు నీట్ (NEET) లో ఉత్తమ ర్యాంకు సాదించేందుకు పుస్తకాలతో మమేకమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగానే మెజార్టీ సీట్లు దక్కించుకుంటున్నారని పేర్కొన్నారు.
Andhra Pradesh
Girls education
MBBS admissions
Medical seats
NEET performance
Health Ministry
Education statistics
NTR Health University
2025-26 academic year
Scroll for the next article