News24th Oct 05:38 PMSunil Byrisetty1 min read
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జిఐఎస్టి బృందం
రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ (RySS) ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా బాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ (APCNF) కార్యక్రమ క్షేత్రాలను GIST) ప్రతినిధి బృందం సందర్శించింది. ఎ
రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ (RySS) ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా బాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ (APCNF) కార్యక్రమ క్షేత్రాలను GIST) ప్రతినిధి బృందం సందర్శించింది. ఎన్. టి. ఆర్ జిల్లా, జి. కొండూర్ మండలంలోని చెవుటూరు గ్రామంలో బృంద సభ్యులు పర్యటించారు. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబిలిటి (GIST) చైర్పర్సన్ ఆండ్రే హాఫ్ మాన్, రొజాలీ హాఫ్ మాన్, సీఈఓ పవన్ సుఖ్వ్ తో పాటు గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (GASP) సెక్రటరీ జనరల్ సత్య ఎస్. త్రిపాఠి బృందంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం కృషి చేస్తున్న ఈ ఉన్నత స్థాయి బృందం, APCNF అమలు విధానం, ఫలితాలు, గ్రామీణ జీవనోపాధులపై ప్రకృతి వ్యవసాయ ప్రభావాన్ని పరిశీలించింది. రైతు సాధికార సంస్థ (RySS) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్ కుమార్ బృందాన్ని స్వాగతించి ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సార్వత్రిక సూత్రాల"ను వివరించారు. జీవ ఉత్ప్రేరకాల తయారీ, విత్తన శుద్ధి, విత్తన గుళికల తయారీ వంటి పద్ధతులను వివరించారు. రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) ద్వారా మెరుగైన నేల ఆరోగ్యం, పంటల అభివృద్ధిపై తమ అనుభవాలను పంచుకున్నారు.