News5th Jun 05:59 PMSunil Byrisetty1 min read

‘గివింగ్ బ్యాక్ టూ’ సేవా కార్యక్రమాలు భేష్

సామాజిక సేవలో గివింగ్ బ్యాక్ టు సొసైటీ అందిస్తున్న చేయూత అభినందనీయమని డా. కంటిపూడి సుధాకర్ కొనియాడారు. విజయవాడ ఎనికేపాడుకు చెందిన బడుగు పునీత్ కుమార్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా

‘గివింగ్ బ్యాక్ టూ’ సేవా కార్యక్రమాలు భేష్
సామాజిక సేవలో గివింగ్ బ్యాక్ టు సొసైటీ అందిస్తున్న చేయూత అభినందనీయమని డా. కంటిపూడి సుధాకర్ కొనియాడారు. విజయవాడ ఎనికేపాడుకు చెందిన బడుగు పునీత్ కుమార్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్నగివింగ్ బ్యాక్ టు సొసైటీ ప్రతినిధులు క్యాన్సర్ బాధితుడు పునీత్ కుమార్ కు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మణిపాల్ హాస్పిటల్ హెడ్ డా. కంటిపూడి సుధాకర్ చేతుల మీదుగా ఆర్థికసాయాన్ని చెక్కు రూపంలో పునీత్ కుమార్‌కు గురువారం డా. సుధాకర్ మాట్లాడుతూ గివింగ్ బ్యాక్ టు సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సమాజ శ్రేయస్సుకు సేవా కార్యక్రమాలు చేస్తున్న గివింగ్ బ్యాక్ టు సొసైటీ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. సేవ చేయడంతోనే ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. గివింగ్ బ్యాక్ టు సొసైటీని స్ఫూర్తిగా తీసుకుని బాధితుడికి మణిపాల్ హాస్పిటల్ తరఫున తగిన సహాయం చేస్తామని చెప్పారు.
Andhra Pradesh news
Vijayawada
Dr. Kantipudi Sudhakar
social service
Giving Back to Society
పునీత్ కుమార్ కు రూ. 2 లక్షల ఆర్థిక సాయం
సేవా కార్యక్రమాలు
Scroll for the next article